సమయ మండలి

పరికరం కోసం ఉపయోగించాల్సిన సమయ మండలిని పేర్కొంటుంది. వినియోగదారులు ప్రస్తుత సెషన్ కోసం పేర్కొన్న సమయ మండలిని భర్తీ చేయగలరు. ఏదేమైనా, లాగ్ అవుట్ చేసాక, అది తిరిగి పేర్కొన్న సమయ మండలికి సెట్ చేయబడుతుంది. చెల్లని విలువను అందిస్తే, విధానం ఇప్పటికీ బదులుగా "GMT"ని ఉపయోగించి సక్రియం చేయబడుతుంది. ఖాళీ వాక్యాన్ని అందిస్తే, విధానం విస్మరించబడుతుంది.

ఈ విధానాన్ని ఉపయోగించకుంటే, ప్రస్తుతం సక్రియంగా ఉన్న సమయ మండలి అలాగే ఉపయోగంలో ఉంటుంది, అయితే వినియోగదారులు సమయ మండలిని మార్చగలరు మరియు ఆ మార్పు అలాగే కొనసాగుతుంది. కనుక, ఒక వినియోగదారు చేసే మార్పు లాగిన్ స్క్రీన్‌ను మరియు మిగతా అందరు వినియోగదారులను ప్రభావితం చేస్తుంది.

కొత్త పరికరాలు "యుఎస్/పసిఫిక్"కి సెట్ చేసిన సమయ మండలితో ప్రారంభించబడతాయి.

విలువ ఆకృతి "IANA సమయ మండలి డేటాబేస్" ("https://en.wikipedia.org/wiki/Tz_database"ని చూడండి)లోని సమయ మండలి పేర్లను అనుసరించి ఉంటుంది. ప్రత్యేకించి, చాలా సమయ మండలాలు "continent/large_city" లేదా "ocean/large_city" ద్వారా సూచించబడతాయి.

ఈ విధానాన్ని సెట్ చేయడం వలన పరికర స్థాన ఆధారిత స్వయంచాలక సమయ మండలి నిర్ధారణ పూర్తిగా నిలిపివేయబడుతుంది. అలాగే ఇది SystemTimezoneAutomaticDetection విధానాన్ని భర్తీ చేస్తుంది.

Supported on: SUPPORTED_WIN7

సమయ మండలి

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameSystemTimezone
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)