లాగిన్ స్క్రీన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనాల జాబితాను కాన్ఫిగర్ చేయండి


లాగిన్ స్క్రీన్‌లో వినియోగదారు ప్రమేయం లేకుండా నిశ్శబ్దంగా ఇన్‌స్టాల్ అయ్యే మరియు తిరిగి అన్‌ఇన్‌స్టాల్ చేయడం సాధ్యపడని అనువర్తనాల జాబితాను పేర్కొంటుంది. అనువర్తనాలు అభ్యర్థించే అన్ని అనుమతులు వినియోగదారు ప్రమేయం లేకుండానే పరిపూర్ణంగా మంజూరు చేయబడతాయి, అలాగే అనువర్తనం యొక్క భవిష్యత్తు సంస్కరణలు అభ్యర్థించే ఏవైనా అదనపు అనుమతులు ఇవ్వబడతాయి.

భద్రతా మరియు గోప్యతా కారణాల కోసం ఈ విధానం ఉపయోగించి పొడిగింపులను ఇన్‌స్టాల్ చేయడం అనుమతించబడదు. అంతేగాక, స్థిరమైన ఛానెల్‌లో పరికరాలు Google Chromeలో సమూహం చేయబడిన అనుమతి జాబితాలో అనువర్తనాలను మాత్రమే ఇన్‌స్టాల్ చేస్తాయి. ఈ షరతులకు అనుగుణంగా లేని ఏ అంశాలు అయినా విస్మరించబడతాయి.

ఇంతకుముందు నిర్బంధంగా ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనం ఈ జాబితా నుండి తీసివేయబడితే అది Google Chrome ద్వారా స్వయంచాలకంగా అన్‌ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

విధానం యొక్క ప్రతి జాబితా అంశం సెమీకోలన్ (;) ద్వారా వేరు చేయబడిన పొడిగింపు ID మరియు "నవీకరణ" URLలను కలిగి ఉండే స్ట్రింగ్. ఉదా. డెవలపర్ మోడ్‌లో ఉన్నప్పుడు chrome://extensionsలో కనుగొనబడే 32-అక్షరాల స్ట్రింగ్‌నే పొడిగింపు ID అంటారు. "నవీకరణ" URL https://developer.chrome.com/extensions/autoupdateలో వివరించినట్లుగా నవీకరణ మానిఫెస్ట్ XML పత్రాన్ని సూచించేది. ఈ విధానంలో సెట్ చేసిన "నవీకరణ" URL ప్రాథమిక ఇన్‌స్టాలేషన్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని; పొడిగింపు యొక్క తదుపరి నవీకరణలు పొడిగింపు మానిఫెస్ట్‌‍లో సూచించిన నవీకరణ URLను వినియోగిస్తాయని గమనించండి.

ఉదాహరణకు, gbchcmhmhahfdphkhkmpfmihenigjmpp;https://clients2.google.com/service/update2/crx ప్రామాణిక Chrome వెబ్ స్టోర్ "నవీకరణ" URL నుండి Chrome Remote Desktopఅనువర్తనాన్ని ఇన్‌స్టాల్ చేస్తుంది. పొడిగింపులను హోస్ట్ చేయడం గురించి మరింత సమాచారం కోసం, ఈ లింక్‌ను చూడండి: https://developer.chrome.com/extensions/hosting.

Supported on: Microsoft Windows XP SP2 లేదా తర్వాత

లాగిన్ స్క్రీన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అనువర్తనాల జాబితాను కాన్ఫిగర్ చేయండి

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS\DeviceLoginScreenAppInstallList
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)